పెద పండగ
బిక్కు బిక్కుమని దిక్కు తోచక అగ్గిపెట్టెలో దాంకుని బ్రతికే నగర జీవితానికి తెరుప్పించింది సొంతూరుకి నడిపించింది పెద పండగ అవసరానికి ఉండే చోట అనుబంధాలు ఎట్టా ఉండేది పేర్లు కూడా తెలియని చోట ప్రేమలు ఎట్టా పండేది శవాలు ఉన్న సవాలు చెయ్యక గులాము మల్లె పనికి పోయే కీళ్ళ బొమ్మలు మాంసపుమరలు ఈ నగరపు మనుషులు పచ్చని చెట్టు చక్కని గాలి చల్లని నీడ చుక్కెడు నీరు అన్నీ అన్నీ ఉన్నోళ్ళకే వెళ్తే కొన్నీ కొన్నీ లేనోళ్ళకి వస్తే ఎట్టా ఎట్టా గడిపేది ఎట్టా ఎట్టా సాగేది ఎంగిలి కుక్కలా, తుంటరి నక్కలా, మనతో మనమే పోటీ పడుతూ మనతో మనమే పోరాడుతూ శాంతి లేక ఓపిక లేక ముగ్గు లేక భాషా మక్కువ లేక భ్రాంతిలో భ్రమలో అర్థం లేని అబద్ధపు బ్రతుకులో చావుని పెంచుతున్నాం, అసమానతను పోషిస్తున్నాం వేరులు తెంచుకున్న చెట్టులా దారం తెగిన పటంలా ఎందుకెందుకు వచ్చామో ఎప్పుడెళ్ళి పోతామో ఇంటికో కంచికో గుండె బరువుతో ఉండే జనాలతో నగరం బరువెక్కి పోతుంటే ఉన్నవారి ధనం, బలం ప్రకృతిని బాధిస్తుంటే ఊపిరి తీసుకోమని వచ్చింది తెరుపిచ్చింది, పలకరించింది సొంతూరి పెద పండగ