Posts

Showing posts from October, 2025

రాజు - రాజు

 ఓ రోజున ఇంటి నుండి పాఠశాలకి వెళ్తుండగా ఓ చెట్టు దగ్గర ఓ పెద్దాయన కనిపించాడు.  "ఏం రాజు ఎలా ఉన్నావు?" అని నవ్వుతూ అడిగాడు. నేను తనని ఎప్పుడూ చూసింది లేదు. "ఎవరు మీరు?" అని అడిగాను. "తర్వాత చెప్తా గాని, తెలుగు పుస్తకం మర్చిపోయావు చూసుకో!" ఇది వినగానే అవాక్కయ్యాను. పుస్తకాలను సరిచూసుకున్నాను. నిజమే! తెలుగు పుస్తకాన్ని మర్చిపోయాను. "నీకెలా తెలిసింది?" "అది తర్వాత చెప్తా గాని, నువ్వు ఆ పుస్తకాన్ని పెట్టుకుని వెళ్ళు - బడికి ఆలస్యం అయ్యేలా ఉంది!"  నేను ఇంటికెళ్ళి తిరిగి వచ్చేలోపు చెట్టు కింద పెద్దాయన కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఆ పెద్దాయన కనిపించాడు.  "ఓయ్! అసలు నువ్వు ఎవరు? అలా కనిపించి ఇలా మాయమయ్యావు? నీ గురించి మా వాళ్ళకి చెప్తే ఎవరూ నమ్మాలేదు. నీ పేరేమిటి? ఊరేంటి?" "ఎవరూ నమ్మాలేదా?" "అహా.." "సోము నమ్మాడుగా!" "ఆ.. అది.. నీకు ఎలా.." అని తడబడ్డాను. ఆ పెద్దాయన నవ్వుతూ, "మనల్ని ఎవరూ నమ్మినా నమ్మకపోయినా - మన వాళ్ళు, మనం అనుకున్న వాళ్ళు నమ్మితే చాలు. నాది ఈ ఊరు కాదు. కాని ఇదివరకు ...

గాజు మహర్షి

ఓ పెద్దాయన ఉదయం పూట నడుచుకుంటూ వెళుతుంటే రోడ్డు మీద ఒక గాజు పెంకు కనిపిస్తుంది. అడ్డంగా ఉందని కాలితో పక్కకి తన్నుదామనుకుంటాడు. కానీ కాలితో తన్నేటప్పటికి ఆ పెంకు ముందుకు జరుగుతుంది. పెద్దాయన అవాక్కవుతాడు. మళ్ళీ ప్రయత్నిస్తాడు. మరలా తప్పించుకుంటుంది. 'అరె ఏం జరుగుతోంది?' అనుకుంటాడు. చివరికి వంగి చేతితో తీసి పక్కకు పడేసి వెళిపోతాడు. ఆ సాయంకాలం తన పెరట్లో నీళ్ళు పోస్తుండగా తన కాలికి రాయికి అడ్డం వస్తుంది. ఆ రాయిని చూసి ఆ పెంకు గుర్తొచ్చి నవ్వుకుంటాడు.  "ఏమిటి నాన్న, నవ్వుతున్నావు?" అని తన కూతురు వెనకాల నుండి అడుగుతుంది. "హహ ఏమి లేదమ్మా! పొద్దున్న ఒక వింత అనుభవం జరిగింది." "ఏంటది?" "ఒక గాజు పెంకుని కాలితో తన్నుదామనుకుంటే దొరకలేదు. ఆఖరికి చేతితో తీస్తే గానీ చిక్కలేదమ్మా" "అవునా! భలే ఉందే! నిజమేనా?" "హా! నేను కూడా నమ్మలేపోతున్నా!" "నాకు దాన్ని చూడాలని ఉంది. మనం రేపు ఇద్దరం వెళ్దామా?" "లేదులే. బహుశా అది నా భ్రమ అయి ఉండవచ్చు. రేపు నేను వెళ్ళి, అది ఇంకా అక్కడే ఉంటే ఇంకోసారి పరీక్షించి అప్పుడు ఇంటికి తెస్తా" ...

చిట్టి చేప

 ఒక రోజు జాలరికి సముద్రంలో ఒక చిన్న చేప దొరుకుతుంది. ఆ చేప బంగారు-ఆకుపచ్చ వర్ణంలో మెరుస్తుంది. 'అరె భలే వింతగా ఉంది! అరుదైన చేపలా ఉంది, ఎక్కువ ధర పలుకుతుంది.' అనుకుని సంబరపడిపోయాడు. కానీ ఆ చేప మాట్లాడటం మొదలెడుతుంది. "ఓయ్! నన్ను ఎందుకు పట్టుకున్నావు?" ఆ మాటలకి అవాక్కయ్యాడు జాలరి. "అదేంటి, తినడానికి" "మమ్మల్ని తింటారా?" "హా! మేము చాలా మంది తింటాం. అదే మా పని. ఈ విషయం మీకు మీ అమ్మానాన్నలు చెప్పలేదా?" "లేదే! మేము చాలా దిగువన ఉంటాం. ఇంత పైకి వచ్చిందే లేదు. అయితే ఇక్కడ ఉన్న చేపల్ని మీరు పట్టుకుని తినేస్తారా?" "అన్నిటినీ కాదు. ఏవి దొరికిపోతే వాటిని." "ఎందుకు మా వాళ్ళని అలా బాధించడం?" "మాకు ఇవే అలవాటు. పైగా కొన్నిటివల్ల ఆరోగ్యం కూడానూ.." ఆ చేప కొంతసేపు ఆలోచించి, "అయితే మీరు ఎప్పుడూ వాసేరు మెక్కని తినలేదా?" "వాసేరు మొక్కా? అదేంటి?" "అయ్యో, మేమంతా అదే తింటాం. చాలా బావుంటుంది. ఆరోగ్యం కూడాను. నేను కావస్తే వాటి ఆకుల్ని తెచ్చి ఇస్తాను. మీరు మా చేపల్ని వేటాడటం మానేస్తారా?" జాలరి ఆలో...

రాజు-రాణి-పక్షి

ఒక అడవిలో ఒక రాజు, రాణి ఉండేవారు. రాణికి ఒకరోజు అడవిని దాటి బయటకి వళ్ళాలనిపించి, రాజుని ఇలా అడిగింది -  "మనం ఎక్కడికైనా వెళ్దాం రాజా!" "ఎక్కడికి రాణి?" "ఎటైనా పర్లేదు. ఇక్కడే ఉండి చిరాకు వస్తోంది." "ఏదైనా ఒకటే రాణి. ఇక్కడ లేని చెట్టా, చేమా! ఇవే జలపాతాలుూ, సరస్సులూనూ..!" రాణి దిగాలుగా మొహం పెట్టి అలా నడుచుకుంటూ నది దగ్గరకు వెళ్ళింది. అక్కడ నీటిలో తన ప్రతిబింబంతో పాటు ఆకాశం కనిపించింది.  *** “ఆకాశాన్ని చూడటానికి వెళ్దాం రాజా!” అంది రాణి, ఎంతో ఉత్సాహంగా. “ఆకాశంలో ఏముంటుంది రాణి? అంతా ఖాళీగా బోసి గానూ!” “ఏమో ఎవరికి తెలుసు? బావుంటుందేమోగా!” “ఆకాశంలో ఎలా తిరుగుతావు రాణి? ఇక్కడ అయితే నడవడానికి నేల ఉంది. మరి అక్కడ?” ఈ ప్రశ్నకి రాణి దగ్గర సమాధానం లేదాయె!  మరి ప్రయాణం ఎలా అని దిగాలు పడింది.  అదే రోజు రాత్రి తన పెరట్లో తిరుగుతుండగా రెండు పక్షుల మాటలు రాణి చెవులో పడ్డాయి. “ఈ రోజు చూసావా ఎంత బాగా ఆకాశంలో తిరిగామో” “హా అవును! అందరికీ దొరకదులే ఇలాంటి అదృష్టం. ఆకాశంలో ఎగరడానికి రహస్యం అందరికీ తెలీదు కదా!”  ‘ఏంటి రహస్యమా!’ అని అనుకుంది రాణి. వెంటనే ఆ పక్షుల దగ్గర...