పావు జీవితపు శుభాకాంక్షలు!

 


గంగమ్మ పేరు పెట్టుకున్న ఓ యువతి..
పాతికేళ్ళ గతాన్ని పోగుచేసుకున్న ఓ పడతి
తీపి కారాలతో విసుగెత్తించే జీవితాన్ని
వెటకారంతో పక్కకినెట్టెయ్యి ఓ పడతి!

ఇలాగ అలాగ అంటూ
లేదు వద్దు అంటూ
కొంటె సాకులతో వింత బేరాలతో
కారణాల వలకు చిక్కకు పడతి!

కాలప్రవాహానికి కొట్టుకు పోయే
గజిబిజి గతుకులలో;
సమయాన్ని తీరిగ్గా,
నెమ్మదిగా, నిదానంగా,
హాయిగా గడుపు యువతి!

త్వరపడకు యువతి,
భయపడకు పడతి,
ముసలితనం ముంచుకుస్తోందని
బాధపడకు యువతి!

బద్ధకం, మతిమరుపు,
కాళ్ళనొప్పి, పంటినొప్పులతో
మనం ముసలోళ్ళం అయి
చాలాయేళ్ళు అయింది పడతి!

మరిచిపో యువతి,
మైమరిచిపో పడతి,
ఆవలించు యువతి,
ఆరగించు పడతి

నేతి బొబ్బట్టుతో, 
నిమ్మ పులిహోరతో,
నిండు నూరేళ్ళు 
బతికేయ్ యువతి!!

Comments

Popular posts from this blog

చిట్టి చేప

నేను - వాళ్ళు