నేను - వాళ్ళు
ఎండ తీవ్రత ఎక్కువైంది..
నేను ఏ.సి. కొంపలోకి పారిపోయాను
వాళ్ళు రేకు కొంపలోనే మగ్గిపోయారు
అనుకోని ప్రమాదం జరిగింది,
డబ్బులు కట్టి బయటపడ్డాను నేను..
కట్టలేక ప్రాణాన్ని వదిలేసారు వాళ్ళు
కాలుష్యం అని కారు కొన్నాను నేను..
దుమ్ము ధూళి నడుమున,
ఒంటి కాళ్ళ నడకన బలి అయిపోతున్నారు వాళ్ళు
పిల్లల కోసం
ఆస్తి పాస్తులు పోగేస్తున్న నేను..
రోజు గడవటమే గొప్ప అని
నేర్చుకుంటున్న వాళ్ళ పిల్లలు
తిన్నది అరగక చచ్చాను నేను..
తినడానికి లేక చచ్చారు వాళ్ళు

Comments
Post a Comment